నా అనుమతి అవసరం: అజిత్ పవార్ తన ఫొటో వాడుకోవడంపై శరద్ పవార్ వ్యాఖ్య

  • అజిత్ పవార్ ప్రారంభించిన ఎన్సీపీ కార్యాలయంలో పవార్ ఫొటో
  • తన భావజాలానికి ద్రోహం చేసినవారు తన ఫోటో ఉపయోగించవద్దన్న పవార్
  • జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ మాత్రమే తన ఫొటో ఉపయోగించుకోవాలన్న ఎన్సీపీ అధినేత
మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. తన ఫొటోను తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఉపయోగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ... తన భావజాలానికి ద్రోహం చేసినవారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్నవారు తన ఫొటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. తాను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ మాత్రమే తన ఫొటోను ఉపయోగించుకోవాలన్నారు. తన ఫొటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనదేనని, తన అనుమతి తప్పనిసరి అన్నారు.

అజిత్ పవార్, పార్టీకి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరిన రెండురోజుల తర్వాత పవార్ ఈ ప్రకటన చేశారు. అజిత్ పవార్ మంగళవారం తమ వర్గానికి కొత్తగా ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పార్టీ కార్యాలయంలో శరద్ పవార్ ఫొటో కనిపించింది.


More Telugu News