'తంగలాన్' ఓ కొత్త ప్రపంచం .. 118 రోజుల ప్రయాణం: విక్రమ్
- 'తంగలాన్'గా కనిపించనున్న విక్రమ్
- షూటింగును పూర్తి చేసుకున్న సినిమా
- కోలార్ బొగ్గుగనుల నేపథ్యంలో నడిచే కథ
- ఈ సినిమా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందన్న విక్రమ్
విక్రమ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'PS -2' ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమాగా 'తంగలాన్ ' సెట్స్ పై ఉంది. జ్ఞానవేల్ రాజా సమర్పించిన ఈ సినిమాకి, పా.రంజిత్ దర్శకత్వం వహించాడు. మాళవిక మోహనన్ - పార్వతి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని విక్రమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, రెండు ఫొటోలను షేర్ చేశాడు. ఈ సినిమా కోసం 118 రోజులు పని చేశానని చెప్పాడు. ఈ సినిమా కోసం గొప్ప వ్యక్తులతో కలిసి పని చేశాననీ, అద్భుతమైన అనుభవాలను ఈ సినిమా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఒక కొత్త ప్రపంచంలో గడిపినట్టుగా అనిపించిందని అన్నాడు.
విభిన్నమైన లుక్స్ తో కూడిన పాత్రలను చేయడం విక్రమ్ కి కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమా పోస్టర్స్ లో చాలామంది ఆయనను గుర్తుపట్టలేదు. అంతగా ఈ పాత్ర కోసం ఆయన తనని తాను మార్చుకున్నాడు. ఆయన లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. కోలార్ బొగ్గుగనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా, వచ్చే ఏడాదిలో 7 భాషల్లో విడుదల కానుంది.