వారణాసి నుంచి వరంగల్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగం
  • టూర్‌కు సంబంధించి తాజాగా అప్‌డేట్ ఇచ్చిన ప్రధాని
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. జిల్లాలో రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. వారణాసి నుంచి బయలుదేరిన ఆయన తన టూర్ అప్‌డేట్స్‌ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వరంగల్‌కు బయలుదేరినట్టు వెల్లడించారు. ప్రధాని మోదీ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. 

నేటి ప్రధాని షెడ్యూల్ ఇదే..

  • శనివారం ఉదయం 7.35 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణం
  • 9.25 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్
  • 9.30 గంటలకు హకీంపేట నుంచి ఎంఐ-17 హెలికాఫ్టర్‌లో వరంగల్‌కు ప్రయాణం
  • 10.15 గంటలకు మామ్నూర్ హెలిప్యాడ్ వద్ద లాండింగ్, రోడ్డు మార్గాన భద్రకాళి ఆలయానికి వెళ్లనున్న ప్రధాని
  • 10.30 నుంచి 10.50 వరకూ ఆలయంలో ప్రత్యేక పూజలు
  • 11.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు ప్రధాని, అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • 11.45లో ఆర్ట్స్ కాలేజీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
  • 12.20-12.30 మధ్య విశ్రాంతి, 12-50 రోడ్డు మార్గాన హెలీప్యాడ్‌కు తిరుగుప్రయాణం
  • 12.55 గంటలకు హకీంపేటకు హెలికాఫ్టర్‌లో తిరిగిరానున్న ప్రధాని
  • 1.45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు వెళ్లనున్న మోదీ


More Telugu News