నా భార్య కూడా ఏడుస్తోంది... నన్ను బెదిరించారు: పవన్ కల్యాణ్
- అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలన్న పవన్
- తనకు సీఎం జగన్ పై కోపం లేదన్న జనసేనాని
- ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు లాక్కున్నారని విమర్శ
వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు తన భార్య కూడా ఏడుస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. తాను వాలంటీర్లను అందర్నీ అనలేదని స్పష్టం చేశారు.
ఈ రోజు పవన్ ఏలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని, వైసీపీ నాయకుల మాటలకు తన భార్య ఏడుస్తోందని అన్నారు.
తనకు ముఖ్యమంత్రి జగన్ అంటే కోపం లేదని, ప్రభుత్వ విధానాల పైనే ద్వేషమన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని, అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదన్నారు. విషయాన్ని పక్కదోవ పట్టించవద్దన్నారు.
రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే నిలబడినట్లు చెప్పారు. ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు తీసుకున్నారని, యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. తనను బెదిరించారని, డబ్బుతో మభ్యపెట్టాలని చూశారని షాకింగ్ కామెంట్లు చేశారు.