ఈ నెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
- ప్రస్తుతం బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం
- ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని కొనసాగుతున్న వైనం
- కొత్తగా అదే ప్రాంతంలో మరో అల్పపీడనం
- తెలుగు రాష్ట్రాలకు ఐదు రోజుల వర్ష సూచన చేసిన ఐఎండీ
ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా, అదే ప్రాంతంలో ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవన ద్రోణి కూడా స్థిరంగా కొనసాగుతుండడంతో, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
కాగా, రాగల 5 రోజులకు ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇవాళ తెలంగాణలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, జులై 25న ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ వివరించింది.