ఈ నెల 25, 26 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు
  • ఐదు రోజుల పాటు  తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
  • రాయలసీమ, కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు
  • తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27 వరకు అతి భారీ వర్షాలు
దేశంలో రుతుపవన ద్రోణి స్థిరంగా, క్రియాశీలకంగా కొనసొగుతోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇప్పటికే ఓ ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ పై కొనసాగుతోందని, రేపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని ఐఎండీ వివరించింది. 

ఈ నేపథ్యంలో, ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 25 నుంచి 27 వరకు రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ నెల 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.


More Telugu News