'స్లమ్ డాగ్ హస్బెండ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ .. అందంగా మెరిసిన శ్రీలీల!

  • సంజయ్ రావు హీరోగా 'స్లమ్ డాగ్ హస్బెండ్'
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల 
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా మెరిసిన శ్రీలీల
  • స్టేజ్ పై ఎమోషనలైన సంజయ్ రావు 
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమా రూపొందింది. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల ముఖ్య అతిథిగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - పార్కు హయత్ లో  నిర్వహించారు. ప్రత్యేక అతిథులుగా దర్శకులు బాబీ .. బుచ్చిబాబు .. కార్తీక్ వర్మ హాజరయ్యారు. 

కార్తీక్ వర్మ మాట్లాడుతూ .. 'విరూపాక్ష' సినిమాకి ముందే నా గురించి అందరితో మంచిగా చెప్పిన వ్యక్తి బ్రహ్మాజీగారు. ఆయనను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. అలాగే సంజయ్ రావ్ ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.   

 బాబీ మాట్లాడుతూ .. నా కెరియర్ తొలినాళ్లలో నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తి బ్రహ్మాజీ గారు. అలాంటి ఆయన తనయుడు హీరోగా చేసిన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ప్రణవి, ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతూ ఉండటం ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.  

బుచ్చిబాబు మాట్లాడుతూ .. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా చేయడం ఆనందంగా ఉంది. తెలుగు అమ్మాయి దొరికిన దర్శకులు అదృష్టవంతులు. నా నెక్స్ట్ మూవీ కోసం తెలుగు అమ్మాయినే తీసుకోవాలని చూస్తున్నాను" అని అన్నారు. 
  
హీరోయిన్ ప్రణవి మాట్లాడుతూ .. " సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు .. థియేటర్స్ బయటికి వస్తూ కూడా నవ్వుతూనే ఉంటారు. అంతగా ఈ సినిమా నవ్విస్తుంది. అలాంటి ఈ సినిమాలో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు.   

సంజయ్ రావు మాట్లాడుతూ .. ఈ కథ కోసం నన్ను ఎంచుకున్న దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. సంగీత దర్శకుడు భీమ్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. ఒక నటుడిగా నా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న తీరును నేను మరిచిపోలేను అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.   

బ్రహ్మాజీ మాట్లాడుతూ  .. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఒక స్టార్ గెస్టుగా కావాలని అనుకున్నాను. శ్రీలీలను అడిగితే 'నేను చేసింది రెండు సినిమాలే సార్ .. నేను చీఫ్ గెస్టు ఏంటి .. బాగుండదేమో' అంది. ఆమెకి ఉన్న క్రేజ్ గురించి చెబితే అప్పుడు ఒప్పుకుంది. అందుకు ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక మా అబ్బాయికి ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు.శ్రీలీల మాట్లాడుతూ .. అల్లు అర్జున్ గారు అన్నట్టుగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి ఎక్కువగా రావాలి. కావ్య కల్యాణ్ రామ్ .. వైష్ణవి తరువాత ప్రణవి పరిచయం అవుతోంది. ఇందాకటి నుంచి నన్ను అనేక టిప్స్ అడుగుతోంది. మన  బౌండరీస్ లో మనం ఉంటే మనలను ఎవరూ ఆపలేరు అనే చెప్పదలచుకున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. 


More Telugu News