రూ.30 లక్షలు చెల్లించండి... ఇండిగో ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ ఆదేశం

  • గత కొంతకాలంగా వార్తల్లోకెక్కుతున్న ఇండిగో 
  • ఓసారి తోక భాగం రన్ వేను తాకిన వైనం
  • గత ఆరు నెలల్లో ఇలాంటివి 4 ఘటనలు
  • తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ పై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) జరిమానా కొరడా ఝళిపించింది. 

ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు, ట్రైనింగ్, ఇంజినీరింగ్ విధివిధానాలకు సంబంధించిన వ్యవస్థీకృత లోపాలు ఉన్నట్టు డీజీసీఐ గుర్తించింది. దాంతో, ఇండిగో సంస్థకు రూ.30 లక్షల జరిమానా వడ్డించింది. డీజీసీఏ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వివిధ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ పత్రాలు, పక్రియల్లో సవరణలు చేపట్టాలని స్పష్టం చేసింది. 

గత కొంతకాలంగా ఇండిగో సంస్థ తరచుగా వార్తల్లోకెక్కడం తెలిసిందే. ఓసారి ఇండిగో విమానం తోక భాగం రన్ వేను ఢీకొట్టింది. ఇలాంటి సమస్యలు ఒకటి కాదు.... ఈ ఆరు నెలల్లో నాలుగు పర్యాయాలు చోటుచేసుకున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఇండిగో వ్యవస్థలపై డీజీసీఐ నిశితంగా దృష్టి సారించింది. వ్యవస్థీకృత లోపాలు ఉన్నట్టు వెల్లడి కావడంతో నోటీసులు జారీ చేసింది. ఇండిగో జవాబు ఇచ్చినప్పటికీ, సంతృప్తి చెందని డీజీసీఏ తాజాగా జరిమానా నిర్ణయం తీసుకుంది.


More Telugu News