బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా కేసీఆర్ అన్న కొడుకు

  • కల్వకుంట్ల వంశీధర్ రావుకు కీలక పదవి
  • కేసీఆర్ చైర్మన్‌గా పదిహేను మందితో తాత్కాలిక స్టీరింగ్ కమిటీ
  • కమిటీలో మహారాష్ట్రకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు
బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల వంశీధర్ రావును నియమించారు. కేసీఆర్ చైర్మన్‌గా పదిహేను మందితో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మహారాష్ట్రకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఉన్నారు. వంశీధర్ రావు కూడా స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 

మహారాష్ట్రలో ఆరు రీజియన్లకు కో-ఆర్డినేటర్లను, సహ కో-ఆర్డినేటర్లను బీఆర్ఎస్ నియమించింది. ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్, పూణే, ముంబయిలు వీటిలో వున్నాయి. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ వెల్లడించారు.


More Telugu News