పరగడుపున ఈ ‘వాటర్’ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు..!
- దాల్చిన చెక్క నీటితో మంచి ఫలితాలు
- రోజూ ఉదయం గ్లాస్ నీటిని తీసుకుంటే చాలు
- బరువు తగ్గొచ్చు, మధుమేహం నియంత్రణ
- చెడు కొవ్వులను తగ్గించుకోవచ్చు
సిన్నమాన్, మన వాడుక భాషలో దాల్చిన చెక్కగా పిలుచుకునే ఈ సుగంధ మసాలా దినుసు వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ, మరికొన్ని వంటల్లో దీన్ని వినియోగిస్తుంటారు. మొత్తం మీద మన దగ్గర వినియోగం తక్కువే. ఒక్కసారి దీనిలోని విశేష ప్రయోజనాల గురించి తెలిస్తే రోజూ విడిచి పెట్టకుండా తీసుకుంటారు. మనలో చాలా మంది ఉదయం నిద్ర లేచిన తర్వాత కాఫీ లేదంటే టీ తాగే అలవాటుతో ఉంటారు. దీనికి బదులు గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగడం వల్ల తప్పక మార్పును గుర్తిస్తారు. నీళ్లలో దాల్చిన చెక్క వేసి 5-10 నిమిషాల పాటు మరిగించి చల్లారిన తర్వాత పరగడుపున తీసుకోవచ్చు. ఇలా కాచిన నీటిని గాలి చొరబడని గాజు పాత్రలో ఉంచి రెండు రోజుల వరకు వాడుకోవచ్చు.
జీర్ణారోగ్యం
సిన్నమాన్ వాటర్ ను పరగడుపున తీసుకుంటే అది జీర్ణ వ్యవస్థపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను పరిష్కరిస్తాయి. అజీర్ణం, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. జీర్ణశక్తి బలపడుతుంది. పోషకాలను మన శరీరం మెరుగ్గా తీసుకోగలదు.
బరువు తగ్గుతారు
బరువు తగ్గాలని చూసే వారికి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుంది. సిన్నమాన్ వాటర్ తాగడం వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి. దీంతో శరీరం అధిక కేలరీలను ఖర్చు చేసేస్తుంది. కొవ్వు కణాలు విచ్ఛేదనమవుతాయి.
రక్తపోటు నియంత్రణ
దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు మధుమేహం నియంత్రణలోనూ మంచి ప్రభావం చూపిస్తుంది. ఇన్సులిన్ సెన్సివిటీని పెంచడం వల్ల ఇలా జరుగుతుంది.
వ్యాధిపై పోరాడే శక్తి
వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. సిన్నమాన్ లో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. దీనిలోని పోషకాలతో ఆ రోజుకు కావాల్సిన అదనపు శక్తిని సమకూర్చుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపగలదు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి.
చెడు కొవ్వులకు చెక్
శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోకుండా దాల్చిన చెక్క సాయపడుతుంది. ముఖ్యంగా గుండెకు రిస్క్ ను తెచ్చి పెట్టే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ దీంతో తగ్గుతుంది.