ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3లో రేపు కీలక ఘట్టం
- జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం
- రేపు చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్
- చంద్రుని దిశగా స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే అత్యధిక దూరం పయనించిందన్న ఇస్రో
- ఆగస్టు 23 నాటికి చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విక్రమ్ ల్యాండర్!
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3లో రేపు కీలక ఘట్టం జరగనుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ శనివారం నాడు చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం పయనించింది. ఆగస్టు 5 రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్ష్యలో ప్రవేశించనుందని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా, ఈ స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. ఈ మేరకు ఇస్రో అంచనా వేస్తోంది.
చంద్రుడిపై సాఫీగా దిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ఇదే ప్రధానమైన తేడా.
నాడు, ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు మూగబోయాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా, విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేశారు.