కారంపూడిలో రేపటి లోకేశ్ బహిరంగ సభ​పై సర్వత్రా ఆసక్తి

  • పల్నాడు జిల్లాలో లోకేశ్ యువగళం
  • వినుకొండ నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర
  • శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మాచర్ల నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం
  • రేపు కారంపూడి వీర్లగుడి సెంటర్ వద్ద లోకేశ్ బహిరంగ సభ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ నియోజకవర్గంలో ఐదు రోజులపాటు కొనసాగి నేటితో ముగిసింది. 

ఆదివారం నాడు జయంతిరామపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మేళ్లవాగు, రెడ్డిపాలెం మీదుగా శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మాచర్ల ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు లోకేశ్ కు అపూర్వ స్వాగతం పలికారు. పల్నాడు పౌరుషానికి గుర్తుగా మిర్చితో తయారుచేసిన గజమాలతో యువనేతకు ఘనస్వాగతం పలికారు. 

పల్నాడులో అత్యంత కీలకమైన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నాడు లోకేశ్ పాల్గొనే బహిరంగసభపై ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది. రేపు కారంపూడిలో సభ జరగనుండగా, లోకేశ్ ఏ రేంజిలో వైసీపీ నేతలపై విరుచుకుపడతాడో చూడాలని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.
ఇవాళ్టి  పాదయాత్రలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

  • ప్రజలకు గుక్కెడు నీళ్లందించలేని దివాలాకోరు ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది.  
  • జల్ జీవన్ మిషన్ అమలులో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి ద్వారా 24/7 స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం.  
  • దీర్ఘకాలంగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పిస్తాం. చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. 
  • స్కూళ్ల విలీనం పేరుతో జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల 4 లక్షల మంది గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.  
  • అధికారంలోకి వచ్చాక వినుకొండ గిరిజన తాండాల విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేస్తాం.  
  • జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు గతంలో అమలుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశారు.  
  • మేం వచ్చాక కారంపూడిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తాం... విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీ కాలేజి అంశాన్ని పరిశీలిస్తాం.  
  • గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాల్లో చదవాల్సి వచ్చినా వారిపై ఎటువంటి భారంపడకుండా రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. 
  • వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి కారణంగా రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో నిలిచింది.  
  • ఎన్ ఎస్ పి కాల్వ ఆధునీకరణ చేపట్టి కాల్వ చివరి భూములకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం.  
  • వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపట్టి బొల్లాపల్లి మండలం తాగు, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. 
  • ముఖ్యమంత్రి జగన్ కు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతాంగ సమస్యల పరిష్కారంపై లేదు.  
  • గత టీడీపీ ప్రభుత్వంలో చిన్న నీటి వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్ననీటి వనరుల అభివృద్ధికి రూ.18,265 కోట్లు ఖర్చు చేశాం.  
  • మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటా. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2343.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.7 కి.మీ.*

*177వరోజు (7-8-2023) యువగళం వివరాలు*

*మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*

సాయంత్రం

4.00 – కారంపూడి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – కారంపూడి తాండా వద్ద రైతులతో సమావేశం.

5.15 – కారంపూడి ఎన్ఎస్ పి కెనాల్ వద్ద స్థానికులతో సమావేశం.

5.35 – కారంపూడి చెక్ పోస్టు వద్ద ముస్లింలతో సమావేశం.

5.45 – కారంపూడి చెన్నకేశవస్వామి గుడి వద్ద యువతతో సమావేశం.

6.00 – కారంపూడి వీర్లగుడి సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

8.00 – సన్నిగుండ్లలో స్థానికులతో సమావేశం.

9.30 – పాదయాత్ర గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

9.45 – జూలకల్లు శివారు విడిది కేంద్రంలో బస.


More Telugu News