తమ కేజ్‌ఫైట్‌ను ‘ఎక్స్’లో లైవ్ ఇస్తామన్న మస్క్.. జుకర్‌బర్గ్ హాట్ కామెంట్స్
- లైవ్ ద్వారా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థకు ఇస్తామన్న మస్క్
- అది నమ్మకమైన ప్లాట్‌ఫాం కాదన్న జుకర్‌బర్గ్
- విశ్వసనీయమైన మరో వేదికను ఉపయోగించకూడదా అని ప్రశ్న
టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ మధ్య కేజ్‌ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. తమ మధ్య జరగనున్న కేజ్‌ఫైట్‌ను ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు మస్క్ ఓ పోస్టులో పేర్కొన్నారు. తద్వారా లభించే నగదును ఓ స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే, ఇంతకుమించిన వివరాలను వెల్లడించలేదు.
మస్క్ ‘ఎక్స్’పై జుకర్‌బర్గ్ స్పందించారు. ఆయన కొత్తగా లాంచ్ చేసిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం థ్రెడ్స్‌లో తీవ్రంగా స్పందించారు. డబ్బును పోగు చూసేందుకు ‘ఎక్స్’ నమ్మకమైన ప్లాట్‌ఫామ్ కాదని పేర్కొన్నారు. తమ మధ్య పోరు జరగబోతోందన్న విషయాన్ని ధ్రువీకరిస్తూనే డబ్బులు సేకరించేందుకు మరింత విశ్వసనీయ ప్లాట్‌ఫామ్‌ను మనం ఉపయోగించకూడదా?.. అని ప్రశ్నించారు.
జుకర్‌బర్గ్‌తో ఫైట్‌కు సిద్ధమవుతున్న మస్క్ బరువులు ఎత్తుతున్న వీడియోను షేర్ చేశారు. జిమ్‌లో వర్కవుట్లు చేసేంత సమయం తనకు ఉండడం లేదని, కాబట్టి పనిచేస్తున్న ప్రదేశానికి బరువులు తెచ్చుకున్నానని పేర్కొన్నారు. ఆ వీడియోలో మస్క్ డంబుల్స్ ఎత్తుతూ కనిపించారు.