చౌక హార్లే డేవిడ్సన్ బైక్ కోసం 25,000 బుకింగ్ లు
- విడుదలైన నెల రోజుల్లోనే రికార్డు అమ్మకాలు
- 440 ఎక్స్ పట్ల వాహన ప్రియుల ఆసక్తి
- రూ.10వేలు పెరిగిన బేస్ వేరియంట్ ధర
ఇప్పుడు ప్రీమియం బైక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు రూ.లక్ష దాటితే ప్రీమియంగా పరిగణించే వారు. కానీ ఇప్పుడు రూ.2 లక్షలు దాటిపోయింది. ఈ విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ అగ్రగామి కంపెనీగా ఉంది. 350 సీసీ అంతకుమించి సామర్థ్యం కలిగిన బైకుల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ డిమాండ్ ను సొంతం చేసుకునేందుకు కొత్త కంపెనీలు సైతం ఈ విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇందులో భాగమే హార్లే డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్ అని చెప్పుకోవాలి. తక్కువ ధరలో వచ్చిన ఈ హార్లే డేవిడ్సన్ బైక్ కోసం పెద్ద సంఖ్యలో వాహన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.
గత నెల 3న హార్లే డేవిడ్సన్ ఎక్స్440 విడుదల అయింది. ఆరంభ ధర కింద బేస్ డెనిమ్ వేరియంట్ ధర రూ.2.29 లక్షలుగా ప్రకటించారు. దీని ధర తాజాగా రూ.2,39,500కు పెరిగింది. ఇందులోనే ఎస్ వేరియంట్ ధర రూ.2.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ ల కోసం ఇప్పటికే 25,000కు పైగా బుకింగ్ లు వచ్చాయి. ఈ బైక్ లో 440సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. హీరో మోటో కార్ప్ వీటిని విక్రయిస్తోంది. భారత మార్కెట్లో ప్రత్యక్ష అమ్మకాల నుంచి తప్పుకున్న హార్లే డేవిడ్సన్, హీరో మోటోతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగిస్తోంది.