స్కాంగ్రెస్.. దాని నిజ రూపం ఇది:కేటీఆర్

  • కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు
  • బిల్లులు మంజూరు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లంచం అడిగారని కాంట్రాక్టర్ల ఆరోపణ
  • ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించిన కేటీఆర్
కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుడే అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ నుంచి లంచం ఆశించారని ఆరోపిస్తూ పలువురు కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ బృహన్ బెంగళూరు మహానగర పాలకె (బీబీఎంపీ) కాంట్రాక్టర్ల సంఘం తమ పనులు నిలిపి వేసింది.

గత 26 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న 2700 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేసే వరకూ పనులు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ వార్తలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ వార్తను తన ట్విట్టర్‌‌లో షేర్ చేసిన కేటీఆర్ ‘స్కాంగ్రెస్.. దాని నిజ రూపాలు’ అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే ముందు నుంచే తీవ్ర వ్యతిరేకత ఉన్న కేటీఆర్ దాన్ని స్కాంగ్రెస్‌ అని విమర్శిస్తుంటారు.


More Telugu News