జగన్ ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్ భూమన
- రేపు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించనున్న భూమన
- కొడుకుతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన భూమన
- టీటీడీ ఛైర్మన్ గా రెండో సారి బాధ్యతలను చేపడుతున్న వైనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ను ఈరోజు ఆయన కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా ఉన్నారు.
రేపు ఉదయం టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలను చేపట్టడం ఇది రెండోసారి. 2006-2008 మధ్య ఆయన తొలిసారి ఛైర్మన్ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త ఛైర్మన్ గా భూమనను జగన్ నియమించారు.