జీ 5 ఓటీటీ సెంటర్ కి హిందీ 'ఛత్రపతి'
- మే 12న విడుదలైన హిందీ 'ఛత్రపతి'
- వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ చేసిన సినిమా
- బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో లభించని ఆదరణ
- ఈ నెల 18 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
బెల్లంకొండ శ్రీనివాస్ తన తొలి సినిమాతోనే మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు హిట్ .. ఫ్లాప్ అనే విషయాలను అలా ఉంచితే, అన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందినవే. ఆయన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చారు. అలాంటి బెల్లంకొండ శ్రీనివాస్ కి 'రాక్షసుడు' తరువాత హిట్ పడలేదు.
ఒక వైపున తెలుగులో ఫ్లాపులు ఎదుర్కుంటూ వచ్చిన ఆయన, ఆ సమయంలోనే హిందీ 'ఛత్రపతి'లో చేశాడు. తెలుగులో రాజమౌళి - కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా, అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఒక కంటెంట్ తోనే మే 12వ తేదీన బాలీవుడ్ కి బెల్లంకొండ పరిచయమయ్యాడు.
వినాయక్ కి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. అయితే, ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 18వ తేదీ నుంచి ఓటీటీ సెంటర్లో స్ట్రీమింగ్ కానుంది. జీ 5వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.