‘ఎక్స్’పై అకౌంట్ బ్లాక్ కుదరదు ఇక!
- త్వరలోనే తొలగించనున్నట్టు మస్క్ ప్రకటన
- యూజర్లను బ్లాక్ చేయడం తనకు నచ్చడం లేదన్న మస్క్
- ఇది అమల్లోకి వస్తే సెలబ్రిటీలకు చిక్కులు
ట్విట్టర్ (కొత్త పేరు ఎక్స్)లో ఉపయోగపడే ఫీచర్లలో యూజర్ బ్లాక్ ఒకటి. ఎవరి నుంచి అయినా వేధింపులు వస్తున్నా, అపరిచితుల నుంచి సందేశాలు వస్తున్నా వారిని బ్లాక్ చేసి నిశ్చింతగా ఉండొచ్చు. కానీ, ఎప్పుడూ ఏదో ఒక చర్యతో వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్ ఈ సౌకర్యవంతమైన ఫీచర్ ను త్వరలోనే తొలగించనున్నట్టు ప్రకటించారు. యాప్ పై యూజర్లను బ్లాక్ చేయడం అర్థవంతంగా లేదన్నది ఆయన అభిప్రాయం.
‘‘బ్లాక్ త్వరలోనే ఓ ఫీచర్ గా తొలగింపునకు గురవుతోంది. డీఎంలకు ఇందులో మినహాయింపు ఉంది’’అని మస్క్ ట్వీట్ చేశారు. నిజానికి ఈ ఫీచర్ తనకు నచ్చడం లేదని మస్క్ లోగడే ప్రకటించారు. డైరెక్ట్ సందేశాలు (డీఎంలు) మినహా మిగిలిన వాటికి డిలీట్ ఆప్షన్ తేనున్నట్టు తెలిపారు. ఇప్పుడు కార్యాచరణకు పూనుకున్నారు. మస్క్ తాజా ప్రకటనపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే సానుకూలంగానే స్పందించారు. మ్యూట్ ఆప్షన్ ఉండాలని సూచించినట్టు చెప్పారు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై యూజర్ బ్లాక్ ఆప్షన్ ఎత్తివేస్తే అది ప్రముఖులు, సెలబ్రిటీలకు చిక్కులు తెచ్చి పెట్టొచ్చు. ఎందుకంటే సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తరచూ సామాజిక మాధ్యమాలపై దూషణలు, వేధింపులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు బ్లాక్ ఆప్షన్ లేకపోతే అది వారి గోప్యతకు భంగం కలిగించకమానదు.