ఇలాంటి జిరాఫీ జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి!
- అమెరికాలోని టెన్నెస్సీ జూలో మచ్చల్లేని జిరాఫీ జననం
- బ్రౌన్ కలర్‌లో మిలమిలా మెరుస్తున్న జిరాఫీ పిల్ల
- ప్రస్తుతం తల్లి సంరక్షణలో ఉన్న జిరాఫీ
అమెరికాలోని టెన్నెస్సీలో ఉన్న బ్రైట్స్ జూలో అత్యంత అరుదైన జిరాఫీ జన్మించింది. మచ్చల్లేని పిల్లకు ఓ జిరాఫీ జన్మనిచ్చింది. దీంతో దాని శరీరం నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది. శరీరంపై మచ్చల్లేని జిరాఫీ జన్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. జులై 31న జన్మించిన ఈ జిరాఫీకి ఇంకా పేరు పెట్టలేదు. శరీరమంతా మొత్తం బ్రౌన్ కలర్‌లో ఉన్న ఈ ఆడ జిరాఫీకి ఒంటిపై మచ్చలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని జూ అధికారులు తెలిపారు. ఈ భూమిపైనే ఇలాంటి జిరాఫీ మరోటి లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జిరాఫీ ఎత్తు ఆరు అడుగులు. ప్రస్తుతం తల్లి సంరక్షణలో పెరుగుతోంది.
ఇది రెటిక్యులేటెడ్ జిరాఫీ అని, అంతరించిపోతున్న జాతికి చెందినదని 2018లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ రెడ్ లిస్ట్‌ను ఉటంకిస్తూ ‘యూఎస్ఏ టుడే’ పేర్కొంది. కాగా, జిరాఫీలు వేగంగా అంతరించిపోతున్నాయని, గత మూడు దశాబ్దాలలో 40 శాతం జిరాఫీలు మాయమయ్యాయని బ్రైట్స్ జూ వ్యవస్థాపకుడు టోనీ బ్రైట్ తెలిపారు. ఆడ జిరాఫీలు 17 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. దాదాపు 1,179 కేజీల బరువుంటాయి.