బరువు తగ్గడానికి సులభ మార్గం.. అవకాడో!

  • ఇందులో అన్నీ మంచి పోషకాలే
  • ఫైబర్, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్
  • జీవనశైలి వ్యాధుల నుంచి రక్షణ
నేడు జీవనశైలి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటిల్లో ముఖ్యమైనది స్థూలకాయం. శారీరక కదలికలు పెద్దగా లేకపోవడం, అధిక కేలరీలతో కూడిన జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మంచి కొవ్వులకు బదులు శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నవి తీసుకోవడం వంటి ఎన్నో అంశాలు  అధిక బరువుకు కారణం అవుతున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో అధిక బరువు సమస్యతో బాధపడేవారికి అవకాడో ఓ మంచి పరిష్కారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

  • ఒక అవకాడో పండులో కేవలం 114 కేలరీలే ఉంటాయి. పైగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహం రిస్క్ ఉండదు.
  • మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ఈ పండు తిన్న తర్వాత చాలా సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.  దీంతో కావాల్సినంత మేరే, పరిమితంగా తినేందుకు ఇది సాయపడుతుంది. 
  • అవకాడోలో ఫైబర్ కూడా ఉంటుంది. మనం రోజువారీ తీసుకోవాల్సిన పరిమాణంలో 15 శాతం ఫైబర్ దీన్నుంచి లభిస్తుంది. పేగుల ఆరోగ్యానికి క్రమబద్ధమైన ఆకలికి ఫైబర్ అవసరం.
  • గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం రిస్క్ తగ్గుతుంది.
  • అవకాడోలో మంచి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సీ, ఈ, కే, బి విటమిన్లు లభిస్తాయి. జీవక్రియల వ్యాధులు రాకుండా ఇవి రక్షిస్తాయి. 


More Telugu News