మోదీ రాజకీయ వారసుడు ఎవరంటే..!: ఇండియా టుడే - సీ ఓటర్ సర్వేలో వెల్లడి

  • అమిత్ షాకు ఓటు వేసిన 29 శాతం మంది
  • యోగి ఆదిత్యనాథ్ ను కోరుకున్న 26 శాతం మంది
  • గడ్కరీ పట్ల మొగ్గు చూపిన 15 శాతం మంది
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తిరుగులేని పాప్యులారిటీతో ప్రధాని మోదీ దూసుకుపోతున్నారు. బీజేపీలో సైతం ఆయనే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఉన్నారు. మరోవైపు మోదీ తర్వాత బీజేపీలో ఆ బాధ్యతలను అందుకునేది ఎవరు? మోదీ రాజకీయ వారసుడు ఎవరు? అనే విషయంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇండియా టుడే - సీ ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మోదీ వారసుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకే ఎక్కువ ప్రజాదరణ కనిపిస్తోంది. మోదీ తర్వాత పీఎం పదవిలో ఎవరిని చూడాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు 29 శాతం మంది అమిత్ షాకు ఓటు వేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు 26 శాతం మంది ఓటు వేయగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పట్ల 15 శాతం మంది మొగ్గు చూపారు.


More Telugu News