నీటిలో కరోనా కొత్త వేరియంట్... అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ

  • 2019 చివర్లో వెలుగుచూసిన కరోనా
  • రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి
  • ఇప్పటికీ పలు వేరియంట్లుగా కొనసాగుతున్న రాకాసి వైరస్
  • ఈ నెలలో బీఏ 2.86 వేరియంట్ గుర్తింపు
  • నీటి నమూనాల్లో దీన్ని గుర్తించిన పరిశోధకులు
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతరించిపోలేదన్న వాస్తవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన నివేదిక ద్వారా వెల్లడించింది. పైగా అది రూపం మార్చుకుని వ్యాపిస్తోందని తెలిపింది. గతంలో గాలి ద్వారా వ్యాపించిన కరోనా వైరస్ రకాలు... ఇప్పుడు ఉత్పరివర్తనాల కారణంగా నీటి ద్వారానూ వ్యాపిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. 

గత నెలలో 9 రకాల కరోనా వేరియంట్లను గుర్తించగా, ఈ నెలలో కరోనా బీఏ 2.86ను గుర్తించారు. ఇది నీటిలో కనిపించడంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటివరకు దీని కారణంగా మరణాలు సంభవించినట్టు ఎక్కడా వెల్లడి కాలేదని, కానీ దీనిపై పూర్తి స్థాయి పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. 

ఈ బీఏ 2.86 వేరియంట్ స్విట్జర్లాండ్, థాయ్ లాండ్ లో గుర్తించినట్టు వివరించింది. కాగా, భారత్ లోనూ మళ్లీ కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించడంతో కేంద్రం సమీక్ష సమావేశం నిర్వహించింది.


More Telugu News