తెలంగాణలో మద్యం షాపుల కోసం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిన ఏపీ కంపెనీ

  • 5 వేలకు పైగా టెండర్లు వేసిన ఏపీ కంపెనీ
  • 110 షాపుల లైసెన్స్ లు సొంతం చేసుకున్న వైనం
  • శంషాబాద్, సరూర్ నగర్ ప్రాంతాలపై టార్గెట్
2023-2025 ఎక్సైజ్ పాలసీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్ లకు టెండర్లను ఆహ్వానించింది. టెండర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. వైన్ షాపులను సొంతం చేసుకోవడానికి లెక్కకు మించి టెండర్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణలో మద్యం దుకాణాల కోసం ఏపీకి చెందిన ఒక రియలెస్టేట్ సంస్థ భారీగా ఖర్చు చేసింది. ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసింది. 5 వేలకు పైగా టెండర్లను దాఖలు చేసింది. లక్కీ డ్రాలో సదరు సంస్థకు 110 షాపుల లైసెన్స్ లు సొంతమయ్యాయి. సదరు సంస్థ రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్టు ఎక్సైజ్ శాఖ పరిశీలనలో వెల్లడయింది. హైదరాబాదులో మద్యం అమ్మకాల తీరును పక్కాగా స్టడీ చేసిన తర్వాత సదరు కంపెనీ రంగంలోకి దిగింది. నగర శివారు ప్రాంతాలైన శంషాబాద్, సరూర్ నగర్ పరిధిలో మద్యం అమ్మకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని గ్రహించి, ఆ ప్రాంతాలను టార్గెట్ చేసింది.


More Telugu News