ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం... అప్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
- సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం
- ఇప్పటికే అప్రూవర్ గా మారిన మాగుంట తనయుడు రాఘవరెడ్డి
- తాజాగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈడీ దూకుడు
- పలువురు ప్రముఖులను విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈ కేసులో అప్రూవర్ గా మారారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.
హైదరాబాదు నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాల వ్యక్తుల నుంచి ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు అందినట్టు భావిస్తోంది. మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది.
ఇప్పుడు అప్రూవర్ గా మారిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈడీ దూకుడు పెంచింది. పలువురు కీలక వ్యక్తులను విచారించింది. ఈడీ విచారణలో మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో తొలుత శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారగా, ఆయన తర్వాత మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్ పై బయట ఉన్నారు.
అప్రూవర్లు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో, హవాలా వ్యవహారాలు నడిపే 20 మందిని ఈడీ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల మరోసారి ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరికొందరిని ఈడీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.