మాట .. మంచితనం తప్ప ఆస్తులేం లేవు: 'జబర్దస్త్' కర్తానందం
- 'జబర్దస్త్'తో గుర్తింపు తెచ్చుకున్న కర్తానందం
- వేషాలు రావడం లేదంటూ ఆవేదన
- ఆస్తులు అమ్మేశానని వెల్లడి
- పిల్లల భవిష్యత్తు ముఖ్యమని వ్యాఖ్య
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో 'కర్తానందం' ఒకరు. సినిమాలలోను ఆయన చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. పొట్టిగా కనిపిస్తూ .. పెద్ద కళ్లను చిత్రంగా తిప్పుతూ .. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ కి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"కొంతకాలం పాటు నేను హోమ్ గార్డుగా పనిచేసేవాడిని .. ఉన్న అరెకరం పొలం సాగు చేసుకుంటూ ఉండేవాడిని. ఆ తరువాత ఉద్యోగం లేదు .. వేషాలు కూడా లేవు. ఇద్దరు పిల్లలను చదివించాలి .. వాళ్ల భవిష్యత్తు బాగుండాలి. అందుకోసం భువనగిరిలో ఉన్న ఇల్లు .. మా ఆవిడకి ఎంతో ఇష్టమైన పొలం అమ్మేశాను" అని అన్నారు.
పిల్లలు బాగా చదువుకుని .. మంచి ఉద్యోగాలు చేసుకుంటే చాలు, వాళ్లే సంపాదించుకుంటారు. వాళ్లు సంతోషంగా ఉంటే చాలు .. అంతకుమించి ఏమీ కోరుకోవడం లేదు. ఊళ్లో ఇప్పుడు మాట .. మంచితనం తప్ప నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అందరం కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా గడుపుతాం" అంటూ చెప్పుకొచ్చారు.