హైదరాబాదులో కాంగ్రెస్ విజయభేరి సభ... షరతులతో అనుమతినిచ్చిన పోలీసులు
- ఈ నెల 17న తుక్కుగూడ వద్ద సభ
- హాజరుకానున్న మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్!
- 25 షరతులతో అనుమతి మంజూరు చేసిన పోలీసులు
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. విజయభేరి పేరిట జరిపే ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ సభ తుక్కుగూడలో ఈ నెల 17న జరగనుంది. దీనిపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పందించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపారు.
అయితే సభకు వచ్చే వారి సంఖ్య 10 వేలకు మించరాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభతో సామాన్య పౌరులకు ఇబ్బంది కలగరాదని, ఆ విషయాన్ని నిర్వాహకులే చూసుకోవాలని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సీపీ పేర్కొన్నారు. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయరాదని తెలిపారు. ఈ మేరకు 25 షరతులతో కాంగ్రెస్ విజయభేరి సభకు అనుమతి ఇస్తున్నట్టు వివరించారు.
కాగా, ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తుండడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.