కోలుకుంటున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఆరా తీసిన సీఎం జగన్

  • కడుపునొప్పితో బాధపడుతూ మణిపాల్ ఆసుపత్రిలో చేరిన గవర్నర్
  • అపెండిసైటిస్‌గా గుర్తించి సర్జరీ 
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న ఆయనకు విజయవంతంగా సర్జరీ చేసినట్టు వైద్యులు జగన్‌కు తెలిపారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 

గవర్నర్ నిన్న కడుపు నొప్పితో బాధపడుతూ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. గవర్నర్ అస్వస్థతకు గురికావడంతో తొలుత రాజ్‌భవన్ వర్గాలు వైద్యులకు సమాచారం అందించాయి. వెంటనే విజయవాడ నుంచి వచ్చిన వైద్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను పరీక్షించారు. 

వారి సూచన మేరకు ఆయనను మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు.  అక్కడాయనను పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించి రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.


More Telugu News