టెర్రరిస్ట్‌లు పిల్లలకు ఇలాగే బ్రెయిన్ వాష్ చేస్తారు: టీడీపీ అనుకూల వీడియోను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ
- జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఓ విద్యార్థి వీడియోను షేర్ చేసిన వర్మ
- దారుణమైన భాష మాట్లాడిస్తున్నారని ఆగ్రహం
- ఇలాంటి తీరుతో పిల్లల మైండ్‌ను కలుషితం చేస్తున్నారని ఆవేదన
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీపై స్పందించారు! ఓ విద్యార్థి అధికార వైసీపీని, ముఖ్యమంత్రి జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను వర్మ షేర్ చేశారు. చదువుకునే చిన్న పిల్లల నోటి నుంచి ఇలాంటి మాటలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది టీడీపీ పద్ధతిలా ఉందని, చిన్నపిల్లవాడితో ఇలాంటి దారుణమైన భాష మాట్లాడిస్తున్నారని, ఇలా మాట్లాడితే ఏ సంస్థలు ఇందుకు సంబంధించి చర్యలు చేపడతాయో కానీ, ఇలాంటి తీరు మాత్రం చిన్నపిల్లల మైండ్‌ను కలుషితం చేస్తుందన్నారు. పిల్లల మెదడును టెర్రరిస్ట్‌లా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారో ఇది వెల్లడిస్తుందన్నారు. కాగా, ఈ వీడియోలో ఓ విద్యార్థి చంద్రబాబుకు మద్దతుగా, జగన్‌పై నిప్పులు చెరిగాడు. ఏం పీకుతున్నావ్, ఒళ్లు బలిసి, జగత్ కంత్రీ అంటూ పదాలు వాడాడు. ఈ వీడియోను వర్మ షేర్ చేశారు.