యూపీలో 5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడి అత్యాచారం!

  • ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహాత్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • తన కూతురిని అత్యాచారం చేశాడంటూ పొరుగింటి బాలుడిపై మహిళ ఆరోపణ
  • పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు వెల్లడి
  • ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఐదేళ్ల కూతురిని పొరుగున ఉండే ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఆరోపించింది. కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగింది. ఘటనపై బాలిక తల్లి అక్బర్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. పిల్లలిద్దరికీ జిల్లా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. 

ఈ నేపథ్యంలో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఐపీసీ‌లోని సెక్షన్ 82 ప్రకారం ఏడేళ్లలోపు చిన్నారులు చేసే ఏ చర్యను నేరంగా పరిగణించరాదు. దీంతో, ఈ కేసు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో న్యాయనిపుణుల సలహా ఆధారంగా ముందుకెళతామని పేర్కొన్నారు.


More Telugu News