'ఉద్దేశపూర్వక ఎగవేతదారుల'పై రుణసంస్థలకు ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు
- ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ఇప్పటి వరకు ఎలాంటి కాలవ్యవధి లేదు
- ఇప్పుడు ఆరు నెలల్లో ప్రకటించాలని ప్రతిపాదించిన ఆర్బీఐ
- అక్టోబర్ 31లోపు వాటాదారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని సూచన
అప్పు ఎగవేతదారులకు సంబంధించి కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు ప్రతిపాదించింది. దీని ప్రకారం అకౌంట్లు నిరర్థకంగా మారిన 6 నెలల్లోపు బ్యాంకులు, రుణ సంస్థలు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కాలవ్యవధి లేదు. ఇప్పుడు ఆరు నెలల్లోగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించాలని ప్రతిపాదించింది.
ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్బీఎఫ్‌సీలకు సూచిస్తోంది. అదే సమయంలో రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగత విచారణకు అవకాశం ఇవ్వాలని... ఈ మేరకు ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌పై వాటాదారులు అక్టోబర్ 31వ తేదీలోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.