రింగ్ రోడ్డు కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. వర్చువల్ గా వాదనలు వినిపించిన లూథ్రా

  • లేని రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై కేసు పెట్టారన్న లూథ్రా
  • కేసు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వాదన
  • సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
అమరావతి రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. లేని రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుపై కేసు పెట్టారని ఆయన కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో విచారణను జడ్జి రేపటికి వాయిదా వేశారు.


More Telugu News