భారత్ ఓ ఆర్థికశక్తి.. కెనడా ప్రధాని వ్యాఖ్య
- భారత్‌తో దృఢమైన బంధం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
- అంతర్జాతీయంగా ప్రాధాన్యమున్న దేశమని ప్రశంస
- నిజ్జర్ హత్యపై దర్యాప్తునకు తమకు సహకరించాలని మరోసారి భారత్‌కు విజ్ఞప్తి
భారత్‌పై అసాధారణ ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా తన స్వరం మార్చారు. భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరుచుకునేందుకు కట్టుబడి ఉన్నామని తాజాగా చెప్పుకొచ్చారు. నిజ్జర్ హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని గతంలో ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే.
‘‘భారత్.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయాల పరంగా ముఖ్యమైన దేశం. భారత్‌తో దృఢమైన బంధాన్ని పెంపొందించుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అయితే, మేము చట్టబద్ధ పాలనకు కట్టుబడ్డ వాళ్లం. కాబట్టి, ఈ విషయంలో ( నిజ్జర్ హత్య విషయంలో) పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చేలా భారత్ కెనడాతో కలిసి పనిచేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నట్టు అక్కడి మీడియా రాసుకొచ్చింది.