తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ

  • తిరుమల కొండపై పెరిగిన భక్తుల రద్దీ
  • స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం
  • కొన్నిరోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా 
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొన్నిరోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్నీ నిండిపోయి, భక్తులు శిలా తోరణం వరకు వేచి ఉన్నారు. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, స్వామివారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 

పురటాసి శనివారాలకు తోడు, కొన్ని సెలవులు కూడా కలిసి రావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ వెల్లడించింది. దాంతో, ప్రతి రోజూ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్ల జారీ అక్టోబరు 1, 7, 8, 14, 15 తేదీల్లో రద్దు చేస్తున్నామని పేర్కొంది. భక్తులు ఈ మార్పును గమనించి, తమకు సహకరించాలని టీటీడీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.


More Telugu News