టెన్నిస్ కోర్టులోనూ ధోనీ మెరుపులు.. వీడియో వైరల్

  • ఫిదా అవుతున్న అభిమానులు
  • ధోనీ ఎక్కడైనా ధోనీయే అంటూ ప్రశంసలు
  • ఆగస్టు 2020లో క్రికెట్ నుంచి తప్పుకున్న మహీ
  • ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నైకి సారథ్యం
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ మెరుపులు.. వీడియో వైరల్
క్రికెట్ మైదానంలో రికార్డులు కొల్లగొట్టిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ టెన్నిస్ కోర్టులోనూ సత్తా చాటుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. టెన్నిస్‌ బ్యాట్‌తో అతడి విన్యాసాలు చూస్తున్న అభిమానులు ముగ్ధులవుతున్నారు. ధోనీ టెన్నిస్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ధోనీ ఎక్కడైనా సత్తా చాటగలడని కొనియాడుతున్నారు.  

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ధోనీ తన వ్యక్తిత్వంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆగస్టు 2020లో క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ ఐసీసీ మూడు ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక టీమిండియా సారథిగా రికార్డులకెక్కాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ధోనీ దేశానికి అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. చెన్నైకి ఇప్పటి వరకు ఐదు టైటిళ్లు అందించాడు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


More Telugu News