తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ లబ్ధిదారులకు అదనంగా తులం బంగారం
- కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో మరో హామీని జోడించాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- ‘కల్యాణ లక్ష్మిని’ని ‘పసుపు కుంకుమ’గా మార్చి కొనసాగించాలని సూచన
- మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందు ప్రతిపాదన
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’లను పేరు మార్పుతో యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. దీనికి అదనంగా ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త హామీని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో జోడించాలని ఆయన మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రతిపాదించారు. ఈ కొత్త పథకానికి ‘పసుపు కుంకుమ’ అని పేరు పెట్టాలని చెప్పారు. కొత్తగా పెళ్లైన పేద యువతులకు కేసీఆర్ ప్రభుత్వం ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాల కింద ప్రస్తుతం రూ.లక్ష ఇస్తున్న విషయం తెలిసిందే.