తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష ఫైనల్ కీ రిలీజ్.. పది ప్రశ్నల తొలగింపు
- శుక్రవారం మాస్టర్ క్వశ్చన్ పేపర్‌తో పాటూ ఫైనల్ కీ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ
- పేపర్-1లో ఏడు, పేపర్-2లో మూడు ప్రశ్నల తొలగింపు
- పలు ప్రశ్నలకు సమాధానాల్లో మార్పులు
- వచ్చే వారం గ్రూప్-4 జనరల్ ర్యాకింగ్ జాబితా జారీ చేసే అవకాశం
తెలంగాణ గ్రూప్-4 ప్రభుత్వోద్యోగ పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ శుక్రవారం ఫైనల్ కీని విడుదల చేసింది. గ్రూప్-4 మాస్టర్ ప్రశ్న పత్రంతో పాటూ ఈ కీని విడుదల చేసింది. ఈ సందర్భంగా పేపర్-1, పేపర్-2లోని మొత్తం పది ప్రశ్నలను తొలగించినట్టు పేర్కొంది.
పేపర్ 1లోని 11,21, 60, 73, 129, 132, 148 ప్రశ్నలను తొలగించారు. మరో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాల్లో మార్పులు చేశారు. 31వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా సరైనదేనని టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఇక పేపర్-2లో 25,40,78 ప్రశ్నలను తొలగించగా, ఐదు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేశారు.
జులై 1న గ్రూప్ 4 పోస్టులకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం, పరీక్షల్లోని ప్రశ్నలకు సమాధానాలతో కూడిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని ఆగస్టు 28న విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు పరిశీలించిన తరువాత టీఎస్‌పీఎస్‌సీ తాజాగా తుది కీని విడుదల చేసింది. కాగా గ్రూప్-4 పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది హాజరు కాగా, పేపర్-2కు 7,61,026 మంది హాజరయ్యారు. మరోవారంలో గ్రూప్-4 జనరల్ ర్యాకింగ్ లిస్టును టీఎస్‌పీఎస్‌సీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత తుది ఫలితాలను ప్రకటిస్తారు.