జయం రవి, నయనతార ‘గాడ్’ సెన్సార్ పూర్తి.... అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్

  • జయం రవి, నయనతార జంటగా 'ఇరైవన్'
  • తెలుగులో 'గాడ్' పేరుతో రిలీజ్
  • ఐ. అహ్మద్ దర్శకత్వంలో చిత్రం
తని ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. 

ఈ సందర్బంగా... నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని తెలిపారు. ఆ కోవలో తమిళంలో విడుదలైన మంచి విజయాన్ని సాధించిన 'ఇరైవన్' చిత్రాన్ని తెలుగులో 'గాడ్' అనే పేరుతో విడుదల చేస్తున్నామని చెప్పారు. 

తమ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశామని వివరించారు. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారని, అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం నరాలు తెగే ఉత్కంఠభరితంగా ఉంటుందని అన్నారు. 

ఈ చిత్రంలో జ‌యం ర‌వి, న‌య‌న‌తార‌తో పాటు వినోద్ కిష‌న్‌, రాహుల్ బోస్‌, విజ‌య‌ల‌క్ష్మి, న‌రైన్‌, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.


More Telugu News