మళ్లీ సొంత గూటికి చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?
- బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి
- రెండు, మూడు రోజుల్లో రాహుల్ ని కలిసే అవకాశం
- మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే చాన్స్
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి కలవబోతున్నట్టు తెలుస్తోంది. ఓ మీడియా సంస్థతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని తనను మునుగోడు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని చెప్పారు. మునుగోడులో ఉప ఎన్నిక సమయానికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని అన్నారు.
మరోపక్క, కొంత కాలంగా బీజేపీ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. నిన్న బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు కనిపించలేదు. దీంతో, అసంతృప్తి మరింత పెరిగినట్టయింది. రెండు, మూడు రోజుల్లో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్ ని కలవనున్నట్టు చెపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది.