1000 కోట్ల అంచనా దిశగా దూసుకుపోతున్న 'లియో'
- ఈ నెల 19న థియేటర్లకు వచ్చిన 'లియో'
- 4 రోజుల్లో 400 కోట్లకి పైగా వసూళ్లు
- ఈ వారాంతానికి 1000 కోట్లు రావొచ్చనే అంచనా
- ఆ దిశగానే దూసుకుపోతున్న సినిమా
విజయ్ హీరోగా రూపొందిన 'లియో' ఈ నెల 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. తమిళ .. తెలుగు భాషల్లో మంచి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ రెండు భాషల్లోను తొలి రోజున చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే కొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4 రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిన్నా .. ఈ రోజు వసూళ్ల వివరాలు తెలియవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం వరకూ ఈ సినిమా జోరు కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఈ ఆదివారం నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మార్కును టచ్ చేయవచ్చనేది విశ్లేషకుల మాట. తమిళనాట .. ఓవర్సీస్ లోను విజయ్ కి గల క్రేజ్ ... లోకేశ్ కనగరాజ్ కి గల ఇమేజ్ ను బట్టి చూస్తే, ఈ అంచనాలను అందుకోవడం అంత పెద్ద కష్టమేమి కాదనేది అభిమానుల అభిప్రాయం. విజయ్ 1000 కోట్ల మార్కును టచ్ చేస్తాడేమో చూడాలి.