40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ సెంచరీ.. అత్యంత వేగవంతమైన శతకంగా ప్రపంచ రికార్డు!

  • నేడు నెదర్లాండ్స్‌పై వన్డే మ్యాచ్‌లో చెలరేగిపోయిన గ్లెన్ మ్యాక్స్‌‌వెల్
  • 9 ఫోర్లు, 8 సిక్సర్లతో వన్డే వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వైనం
  • గతంలో సౌతాఫ్రికా ఆటగాడు మార్కరమ్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో రికార్డుల మోతమోగుతోంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. డచ్ బౌలర్లపై ఆకాశమేహద్దుగా చెలరేగిపోయిన మ్యాక్స్‌వెల్ 101 పరుగులతో (9 ఫోర్లు, 8 సిక్సర్లు) వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్‌కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లోనే మార్కరమ్ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే. 

ఇప్పటివరకూ అత్యధిక వేగవంతమైన సెంచరీలు ఇవే..

  • 40 బంతుల్లో గ్లెన్ మాక్స్‌వెల్ నెదర్లాండ్స్ మీద సెంచరీ-2023
  • 49 బంతుల్లో ఎయిడెన్ మార్కరమ్ శ్రీలంకపై సెంచరీ-2023
  • 50 బంతుల్లో కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్‌పై సెంచరీ-2011,
  • 51 బంతుల్లో శ్రీలంకపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచరీ-2015,
  • 52 బంతుల్లో ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్‌పై సెంచరీ-2015




More Telugu News