'కాంగ్రెస్‌ను నమ్మి మాలా మోసపోవద్దు' అంటూ కొడంగల్‌లో కర్ణాటక రైతుల నిరసన, ర్యాలీ
- వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కర్ణాటక రైతుల ర్యాలీ
- కాంగ్రెస్ తమకు ఇచ్చిన ఐదు హామీలు కర్ణాటకలో అమలు కావడం లేదన్న రైతులు
- రైతులను అడ్డుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
కొడంగల్ నియోజకవర్గంలో కర్ణాటక రైతులు నిరసన దీక్ష చేపట్టగా, వారిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏవీ నెరవేర్చడం లేదని, ఆ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు తమలా మోసపోవద్దంటూ నియోజకవర్గం కేంద్రం కొడంగల్‌లోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కర్ణాటక రైతులు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ తమకు ఇచ్చిన ఐదు హామీలు కర్ణాటకలో అమలు కావడం లేదన్నారు.
అయితే కర్ణాటక రైతులు వినాయక కూడలి నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే యూత్ కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. కర్ణాటక రైతులు తమకు సమస్యలు ఉంటే అక్కడ నిరసన తెలపాలని, కానీ తెలంగాణకు వచ్చి నిరసన తెలపడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ క్రమంలో కర్ణాటక రైతులు, యూత్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సద్దుమణిగింది.