చెప్పండి పురందేశ్వరి మేడమ్... మీరెందుకు ఈ లేఖ రాశారు?: పోసాని

  • జగన్, విజయసాయిలపై సీజేఐకి లేఖ రాసిన పురందేశ్వరి
  • నిప్పులు చెరుగుతున్న వైసీపీ నేతలు
  • పురందేశ్వరి మేకవన్నె పులి అంటూ పోసాని ఫైర్
సీఎం జగన్ పై ఉన్న కేసులను తిరగదోడాలని, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాయడం వైసీపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వారు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా పురందేశ్వరిపై ధ్వజమెత్తారు. పురందేశ్వరి ఒక మేకవన్నె పులి అని విమర్శించారు. 

"పురందేశ్వరి గారూ... మీరు మేకవన్నె పులి. ఉన్నాడు కదా... మీ మరిది... అతగాడేమో ఒక మగ వగలాడి! మీరు నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి... మా కమ్మ వాళ్లకు చెబుతున్నా, మా కాపు సోదరులకు చెబుతున్నా. ఇలాంటి దుర్మార్గులైన రాజకీయ నాయకులను మీరు నమ్మకండి. ఈవిడ (పురందేశ్వరి) కోర్టులను తప్పుదోవ పట్టించి పెద్ద నీతిమంతురాలి లాగా, పెద్ద పుడింగి లాగా మాట్లాడుతోంది. 

అయ్యో చీఫ్ జస్టిస్ గారూ... వీళ్లిద్దరూ బయట ఉంటే భారతదేశం నాశనమైపోతోంది, సమాజం అల్లకల్లోలమైపోతోంది అంటూ గగ్గోలు పెట్టారు. ఎందుకంటే... జగన్ బయటుంటే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు... నా మరిది ముఖ్యమంత్రి కాలేడు... నా మరిది ముఖ్యమంత్రి అయితే నేను ఎంపీగా గెలవొచ్చు... కేంద్రంలో ఎవరున్నా సరే కేంద్రమంత్రి అవ్వొచ్చు... పురందేశ్వరి ఆలోచన ఇదే. బాబు అంటే అంత నమ్మకం ఆమెకు. 

చెప్పండి పురందేశ్వరి మేడమ్... ఎందుకు లెటర్ రాశారు మీరు? ఇలాంటి లెటర్లు ఎవరు రాయాలి? నిజమైన సామాజిక కార్యకర్త, ఉత్తముడు, భారతదేశాన్ని ప్రేమించేవాళ్లు, న్యాయస్థానాన్ని ప్రేమించేవాళ్లు, న్యాయవ్యవస్థ వర్ధిల్లాలి అని కోరుకునేవాళ్లు ఇలాంటి లేఖలు రాయాలి. కానీ మీరెందుకు రాశారు? 

జగన్ గారు మీ మరిదిలాగా అవినీతి చేసి ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు వెళ్లలేదు. ఆ రోజు నీ తమ్ముడి కోసం నువ్వు ఎలా న్యాయస్థానం విలువలు నాశనం చేశావో, బాబు కూడా అంతే. న్యాయస్థానం విలువలను నాశనం చేసి, తప్పుదోవ పట్టించి జగన్ పై అవినీతి ముద్ర వేసి జైల్లో పెట్టించాడు" అంటూ పోసాని పేర్కొన్నారు.


More Telugu News