హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్!
- కాంగ్రెస్ తరపున గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలు
- తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న పలువురు ఎమ్మెల్యేలు
- ప్రొఫెసర్ నాగేశ్వరావు, చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు
తెలంగాణలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 64 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో, కొత్త ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్యేలందరికీ వారు ప్రస్తుతం బస చేసిన హోటల్ ఎల్లాలో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల బాధ్యతలు, విధులు, హక్కులు, అసెంబ్లీ నియమ నిబంధనలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ట్రైనింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం.