తెలంగాణ మంత్రులుగా 11 మంది.. కేబినెట్ కూర్పు

  • రాజ్ భవన్ కు జాబితా పంపిన కాంగ్రెస్
  • రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం
  • మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఠాక్రే ఫోన్
తెలంగాణ మంత్రులుగా 11 మంది.. కేబినెట్ కూర్పు
తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు మంత్రుల జాబితా ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవికి ఎంపిక చేసిన నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి అభినందించినట్లు సమాచారం. 
ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీళ్లే..

  • భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి)
  • శ్రీధర్ బాబు
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సీతక్క
  • కోమటి రెడ్డి వెంకట రెడ్డి
  • తుమ్మల నాగేశ్వర్ రావు
  • పొన్నం ప్రభాకర్
  • కొండా సురేఖ
  • దామోదర రాజనర్సింహ
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • జూపల్లి కృష్ణారావు


More Telugu News