రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి: నిర్మలా సీతారామన్

  • కేంద్ర పథకాలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న నిర్మల
  • గ్రామీణ ప్రజల కోసం 17 పథకాలు అమలు చేస్తున్నట్టు వెల్లడి
  • మోదీ గ్యారెంటీ వ్యాన్ ద్వారా పథకాల గురించి తెలుసుకోవాలని సూచన
కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 17 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మోదీ గ్యారెంటీ వ్యాన్ ద్వారా 17 పథకాల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కోసం అందరూ సంకల్పం తీసుకుని పనిచేయాలని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. 

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. రూ.2 వేల విలువైన ఎరువుల బస్తాను రైతులకు సబ్సిడీపై రూ.266కే ఇస్తున్నామని వెల్లడించారు. రైతులు అందరూ తప్పనిసరిగా కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకుని, దానిపై ప్రయోజనాలు పొందాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నానో ఫర్టిలైజర్ల పట్ల రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.


More Telugu News