సోదరి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రడికి రాలేదు: సీఎం జగన్

  • శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం
  • దత్తపుత్రుడు అంటూ పవన్ పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన వైనం
ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేశారు. 

"ఈ దత్తపుత్రుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే... తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీ పెట్టాడు. ఆ సమయంలో అతడు అన్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ పెద్ద మనిషి అంటాడూ... తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నాడట. తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టం అని కూడా అంటాడు. 

తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజి స్టార్... చంద్రబాబునాయుడికి పార్టనర్. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానంటూ తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజి స్టారు... ఈ మ్యారేజి స్టారు! 

ఏపీ పాలకులపై ఇన్నిన్ని డైలాగులు కొట్టిన ఈ పెద్దమనిషికి తెలంగాణలో సోదరి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. దత్తపుత్రుడు నిలబెట్టిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. 

ఈ పెద్దమనిషికి ఏపీలో చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రజలపై ప్రేమే లేదు. ఈ పెద్దమనిషికి రాష్ట్రంలో ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు" అంటూ సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలతో హోరెత్తించారు.


More Telugu News