వందల ఎకరాలు ఉన్న వాళ్లు, హీరోలు, హీరోయిన్లు, అధికారులు, నేతలకు రైతు బంధు వద్దు: గోరటి వెంకన్న
- పది ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు రైతుబంధు ఇవ్వవద్దని సూచన
- చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని వ్యాఖ్య
- రైతుబంధు, పేదలకు నీళ్లు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్‌దే అన్న గోరేటి
వందల ఎకరాలు ఉన్న హీరోలు, హీరోయిన్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, నాయకులకు రైతుబంధు వద్దని తాను ఇది వరకే చెప్పానని... ఇప్పుడూ చెబుతున్నానని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. పది ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు రైతుబంధు ఇవ్వవద్దన్నారు.
ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ... చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని ప్రశంసించారు. పేదలకు నీళ్లు, రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్‌దే అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రదిష్ఠ పాలుకావడానికి అధికారులే కారణమని ఆరోపించారు. అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించి కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టారని, హరగోపాల్ మీద కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ వారసులారా... మీరు తప్పు చేయవద్దు అంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.