కొవిడ్ వేరియంట్ జేఎన్.1 పట్ల ఆందోళన వద్దు... ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి!
- జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి
- కరోనా అనుమానిత లక్షణాలుంటే కరోనా నోడల్ కేంద్రాన్ని సందర్శించాలి
- పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
కరోనా... జేఎన్.1గా రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తోంది. ఈ కొత్త రకం కొవిడ్‌పై ఎలాంటి ఆందోళన పడక్కర్లేదని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తెలంగాణలోనూ కేసుల సంఖ్య డబుల్ డిజిట్‌ను తాకింది. ఈ నేపథ్యంలో ఆందోళన చెందడం కంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
- జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
- కరోనా అనుమానిత లక్షణాలుంటే కరోనా నోడల్ కేంద్రాన్ని సందర్శించాలి.
- పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు.
- రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను ధరించాలి.
- చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
- తుమ్మినా, దగ్గినా నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి.
- పరస్పరం కలిసినప్పుడు కరచాలనం కంటే నమస్కారం చేయడం మంచిది.
- తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయాలి. విందు, వినోదాలు తగ్గించుకోవాలి.
- ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తాగాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
- ఇంటి లోపల వెచ్చటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
- పిల్లలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించాలి.