దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ కు 408 రన్స్ వద్ద తెరదించిన టీమిండియా

  • సెంచురియన్ లో తొలి టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 408 పరుగులు చేసిన సఫారీలు
  • గాయంతో కారణంగా బ్యాటింగ్ కు దిగని కెప్టెన్ టెంబా బవుమా
  • డీన్ ఎల్గార్ (185) భారీ సెంచరీ... అర్ధసెంచరీలు సాధించిన యన్సెన్, బెడింగ్ హామ్
  • 4 వికెట్లతో సత్తా చాటిన బుమ్రా... సిరాజ్ కు 2 వికెట్లు
సెంచురియన్ లో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. డీన్ ఎల్గార్ (185) భారీ సెంచరీ, మార్కో యన్సెన్ (84 నాటౌట్), డేవిడ్ బెడింగ్ హామ్ (56) అర్ధసెంచరీల సాయంతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 408 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు. 

కాగా, సఫారీలకు కీలకమైన 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, మహ్మద్ సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఆటకు ఇవాళ మూడో రోజు. మరో రెండున్నర రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో, మ్యాచ్ ఫలితంపై ఆసక్తి నెలకొంది.

రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కూడా 400 పైచిలుకు స్కోరు సాధిస్తే, దక్షిణాఫ్రికా ముందు ఓ మోస్తరు లక్ష్యం ఉంచే అవకాశం ఉంటుంది.


More Telugu News