నాకేమైనా జరిగితే జగన్, భారతిదే బాధ్యత: బీటెక్ రవి

  • బీటెక్ రవికి గన్ మెన్లను తొలగించిన ఏపీ ప్రభుత్వం
  • తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారన్న బీటెక్ రవి
  • హైకోర్టును ఆశ్రయిస్తానన్న టీడీపీ నేత
టీడీపీ పులివెందుల ఇన్ఛార్జీ బీటెక్ రవికి ఏపీ ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. ఈ నేపథ్యంలో బీటెక్ రవి మాట్లాడుతూ తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. అందుకే తన గన్ మెన్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకున్న ఇద్దరు గన్ మెన్లు ఉదయం వెళ్లిపోయారని... ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే జగన్, ఆయన భార్య వైఎస్ భారతి, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.


More Telugu News